- Step 1
కాప్సికమ్‌ను శుభ్రంగా కడిగి మెత్తగా అయ్యేవరకూ ఉడికించాలి.
- Step 2
తర్వాత అందులో నీటిని వంచేసి చల్లారనివ్వాలి. ఉడకబెట్టి ఉంచుకున్న ఆలుగడ్డను చిదమాలి.
- Step 3
బాణలిలో రెండు టీ స్పూన్ల నెయ్యి లేదా నూనె వేసి అందులో తరిగిన ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చే వరకూ వేయించాలి.
- Step 4
ఇందులో మసాలా దినుసులు, ఆలుగడ్డ చిదుము, బఠాణీలు వేసి కొద్ది నిమిషాలు వేయించాలి.
- Step 5
చాకుతో కాప్సికమ్ తొడిమను, లోపల ఉన్న గింజలను తొలిగించాలి.
- Step 6
తర్వాత చేసి వేయించిన స్టఫిం గ్‌ను అందులో జాగ్రత్తగా పెట్టాలి.
- Step 7
మరొక బాణలి పొయ్యి మీద పెట్టి తగినంత నూనె పోసి స్టఫ్ చేసుకున్న కాప్సికమ్‌ను అందులో వేసి అన్ని వైపుల నుంచి వేయించాలి.
- Step 8
వేగిన కాప్సికమ్ మీద పనీర్ తురుము, కొత్తిమీర ఆకులు, గుండ్రంగా తరిగిన టమాటాలతో అలంకరించి వేడి వేడిగా సర్వ్ చేయాలి.