- Step 1
క్యారెట్, ఆనపకాయల చెక్కుతీసి తురిమి పెట్టుకోవాలి. ఆనపకాయ నుంచి నీళ్ళు పూర్తిగా పిండేయాలి.
- Step 2
ఉడక బెట్టిన బంగాళాదుంపలను కూడా తురిమి ఉంచుకోవాలి.
- Step 3
ఇప్పుడు ఒక గిన్నెలో కొంచెం నూనె తీసుకొని దానిలో పచ్చి మిరపకాయలు వేయించి అందులో శనగపిండి కూడా దోరగా వేయించి ఆ తర్వా త తురిమి పెట్టుకున్న క్యారెట్, ఆనపకాయల ను వేసి బాగా కలిపి స్టౌమీద నుంచి కిందకు దింపేయండి.
- Step 4
దానిలో తురిమిన బంగాళా దుంపలు, పెరుగుమీగడ, కొత్తిమీర, నిమ్మకాయ, తగినంత చేర్చి, పిరమిడ్లలాంటి కోఫ్తాలుగా చేయండి.
- Step 5
ఆ తర్వాత వీటిని కార్న్‌ఫ్లోర్‌లో దొర్లించి, కాగిన నూనెలో దోరగా వేయించి, ఒక డిష్‌లో అమర్చండి. వీటిమీద తయారుచేసి ఉంచుకున్న గ్రేవిని పోసి పైన కొత్తిమీర, క్రీమ్‌తో వడ్డించండి.
- Step 6
గ్రేవీకోసం : జీడిపప్పు, గసగసాలు మెత్తగా రుబ్బి పక్కన ఉంచుకోండి
- Step 7
ఒక గిన్నెలో వందగ్రాముల నూనెపోసి, సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేయించి, అందులో అల్లం వెల్లుల్లి ముద్ద, కారంపొడి, వేశాక నూరిన మసాలను కలిపి నూనె తేలేవరకూ ఫ్రై చేయండి.
- Step 8
అందులో పెరుగు, గరం మసాలా, తగినన్ని నీళ్ళు పోసి మరగనివ్వాలి.