- Step 1
టమాటాలను మృదువుగా అయ్యేవరకూ ఉడకించాలి.
- Step 2
తర్వాత చల్లారనిచ్చి దాని తొక్కు తీసేసి దానితో గుజు తయారు చేసుకోవాలి. లేదా రెడీమేడ్‌గా దొరికే టమాటా ప్యూరీని కూడా వినియోగించవచ్చు.
- Step 3
తర్వాత ఒక స్పూన్ నేతిని బాణలిలో వేసి డ్రైఫ్రూట్స్‌ను ఒక నిమిషం పాటు మీడియం మంట మీద వేయించాలి.
- Step 4
వాటిని తీసేసి నూనె వేసి వేడి చేసి ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయిం చాలి.
- Step 5
ఇందులో ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసి రెండు మూడు నిమిషాల పాటు వేగనివ్వాలి.
- Step 6
తర్వా త అందులో టమాటా ప్యూరీని, డ్రై ఫ్రూట్స్‌ని వేయాలి.
- Step 7
గరిటతో తిప్పుతూ దానిని నాలుగు నిమిషాల పాటు ఉడకించాలి.
- Step 8
బాణలికి అంటుకోకుండా జాగ్రత్త పడాలి. ఇందులో పాలు, కాసిని నీళ్ళు పోస్తూ పొంగురానివ్వాలి.
- Step 9
తర్వాత మంట తగ్గించి గ్రేవీ చిక్కగా అయ్యే వరకూ ఉంచాలి.
- Step 10
తర్వాత అందులో పనీర్ వేసి గరిటతో తిప్పాలి.
- Step 11
చివరగా ఉడకబెట్టుకున్న కూరగాయల ముక్కలను గ్రేవీలో వేసి ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు ఉడికించాలి.
- Step 12
సర్వ్ చేసే మందు దానిపై మీగడ, కొత్తమీర ఆకులతో అలంకరించి సర్వ్ చేయాలి. ఇది చపాతీలలోకి, నాన్‌లలోకి అధరవుగా బాగుంటుంది.