- Step 1
టమాటాలను శుభ్రంగా కడిగి ఆరనివ్వాలి. తర్వాత టమాటా పై భాగంలో తొడిమ దగ్గర గుండ్రంగా కత్తిరించాలి.
- Step 2
తర్వాత మధ్యలో ఉన్న పదార్ధాన్ని జాగ్రత్తగా బయటకు తీయాలి.
- Step 3
దీనిని ఒక పక్కన పెట్టి పైన తీసేసిన భాగాన్ని చిన్న ముక్కలుగా చేసుకోవాలి. పొయ్యి మీద బాణలి పెట్టి కొద్ది నూనె వేసి వేడి చేసి అందులో తరిగిన ఉల్లిపాయలు, పచ్చి మిర్చి వేసుకొని మెత్తగా అయ్యే వరకూ వేయించాలి.
- Step 4
ఇప్పుడు టమాటోలో తీసిన గుజ్జును, టమాటా ముక్కలను వేసి ఒక నిమిషం వేయించి అందులో మసాలాలు వేసి మరొక నిమిషం వేగనివ్వాలి.
- Step 5
తర్వాత అందులో పనీర్ వేసి ఒక నిమిషం ఉడకనివ్వాలి.
- Step 6
తర్వాత దానిని పక్కకి తీసి ఈ మిశ్రమాన్ని టమాటాల్లో నింపాలి. దానిపై తురిమి పెట్టుకున్న చీజ్, కొత్తిమీరను వేయాలి.
- Step 7
తర్వాత ప్రెషర్ కుక్కర్ ప్లేట్‌లో పెట్టి దాని పై వెన్న వేసి ఒక విజిల్ వచ్చే వరకూ ఉడకనివ్వాలి.
- Step 8
లేకుంటే దానిని ఒవెన్‌లో 200 డిగ్రీల వేడితో ఒక ఇరవై నిమిషాల పాటు బేక్ చేసుకోవచ్చు. దీనిని వేడి వేడిగా సర్వ్ చేస్తే చాలా రుచిగా ఉంటుంది.