- Step 1
లేత మొక్కజొన్న గింజల్ని ఒలిచి మిక్సీలో కాస్త కచ్చాపచ్చాగా రుబ్బాలి.
- Step 2
ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, క్యాప్సికమ్, అల్లం... అన్నీ చాలా సన్నగా తరగాలి.
- Step 3
ఓ పాత్రలో రుబ్బిన మొక్కజొన్న ముద్ద వేయాలి. అందులోనే ఉప్పు, గరంమసాలా, చాట్‌మసాలా, అల్లంముక్కలు వేసి కలపాలి.
- Step 4
తరువాత ఉల్లిపాయలు, క్యాప్సికమ్, కొత్తిమీర, పచ్చిమిర్చి, వడకట్టిన పెరుగు వేసి కాస్త గట్టిగా కలుపుకోవాలి.
- Step 5
ఇప్పుడు వేలు మందంలో ఉండే ఇనుపచువ్వను తీసుకుని ఈ కబాబ్ మిశ్రమాన్ని దాని చుట్టూతా అంటించి నిప్పులు లేదా గ్యాస్స్టవ్మీద ఎర్రగా కాల్చాలి. వీటిని వేడివేడిగా చట్నీతో వడ్డిస్తే భలే రుచిగా ఉంటాయి.