- Step 1
బ్రెడ్ స్లైసులను చిన్న ముక్కలుగా చేసి ఒక బౌల్‌లో వేయాలి.
- Step 2
అందులోనే టొమోటో, ఉల్లిపాయ, పుదీనా, కొత్తిమీర పేస్ట్, కాస్తంత నూనె, జీలకర్ర, పచ్చిమిర్చి ముద్ద, ఉప్పు వేసి బాగా కలియబెట్టాలి.
- Step 3
అరగంటయ్యాక ముద్దలా తయారైన ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి చేత్తో వడల్లాగా వత్తుకోవాలి.
- Step 4
ఇలా తయారైన వాటన్నింటినీ కార్న్‌ఫ్లోర్‌లో అద్ది ఒక ప్లేటులో పరచుకోవాలి.
- Step 5
ఇప్పుడు బాణలిలో నూనె పోసి కాగుతుండగా పైన తయారు చేసిన వడలను వేసి రెండువైపులా దోరగా కాల్చాలి. వీటినో సర్వింగ్ ప్లేటులోకి తీసుకుని పైన ఉల్లిపాయలు, కొత్తిమీర తరుగులతో గార్నిష్ చేసి సర్వ్ చేస్తే టొమోటో కట్‌లెట్స్ తయారైనట్లే..!