- Step 1
పనసపొట్టుని మూడొంతులు నీరున్న పెద్ద పాత్రలో వేసి బాగా కడిగి నీటిపై తేలిన పొట్టును మాత్రం తీసుకోవాలి.
- Step 2
ఇందులో తగినంత నీరు, పసుపు, ఉప్పు వేసి ఉడికించి నీరు వార్చి చల్లారనివ్వాలి.
- Step 3
ఎండుమిరపకాయలను వేగించి, నువ్వులతో పాటు దంచి, పొడి చేసి పెట్టుకోవాలి. తర్వాత కడాయిలో నూనె వేసి ఎండుమిర్చి, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు వేగాక ఉడికించిన పనసపొట్టుని కలపాలి.
- Step 4
సన్నని సెగమీద నీరంతా ఇగిరిన తర్వాత నువ్వులపొడి మిశ్రమాన్ని కలిపి మరికొంతసేపువుంచి దించేయాలి.
- Step 5
చల్లారిన తర్వాత ఆవపిండి కలిపి, కొత్తిమీర చల్లి (ఘాటు పోకుండా) కాసేపు మూతపెట్టాలి.