- Step 1
ఓ గిన్నెలో గోధుమ పిండి, జీలకర్ర పొడి ,ఉప్పు తీసుకుని కలపాలి.
- Step 2
తరువాత నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలా కలిపి పెట్టుకోవాలి.
- Step 3
కొద్దిగా పిండిని తీసుకుని చపాతీలా వత్తుకుని తీసుకోవాలి.
- Step 4
అలాగే మరికొంచెం పిండి కూడా తీసుకుని అదే సైజులో చపాతీ చేసుకోవాలి.
- Step 5
ఒకదానిపై కొద్దిగా వెన్న, జామ్‌ని పూతలా రాయాలి. దానిపైనా కొద్దిగా వెన్న, జామ్‌ని పూతలా రాయాలి.
- Step 6
దానిపైన మరో చపాతీ ఉంచి అంచుల్ని అతికించేయాలి.
- Step 7
దీన్ని వేడిపెనంపై ఉంచి నూనె వేసుకుని రెండు వైపులా కాల్చుకోవాలి.
- Step 8
ఇలా మిగిలిన పిండిని కూడా చేసుకుంటే సరి.