- Step 1
కొబ్బరిని చిన్న ముక్కలుగా చేసి మిక్సీలో వేసి మెత్తగా చేసి పక్కన పెట్టుకోవాలి.
- Step 2
బాణలిలో చెంచాడు నూనె కాగిన తరవాత బెండకాయముక్కలను రెండు నిముషాలు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.
- Step 3
అదే బాణలిలో మరో రెండు స్పూన్ల నూనె వేసి కాగాక ఉల్లితరుగు వేసి వేయించాలి.
- Step 4
వేగాక అల్లం వెల్లుల్లిముద్ద కూడా వేసి మరో నిముషం వేయించి, టొమాటో ముక్కలు, నీళ్లు, బెండకాయ ముక్కలు వేసి ఐదు నిముషాలు మూతపెట్టి ఉడికించాలి.
- Step 5
దీనిలో రుబ్చుకున్న కొబ్బరి, ఉప్పు, పసుపు, కారం, గ్లాసు నీళ్లు, గరంమసాలా వేసి మరో 5 నిముషాలు ఉడికించి దించుకోవాలి.
- Step 6
వేరే బాణలిలో కొంచెం నూనె వేసి వేడి చేసి దానిలో పోపు దినుసులు వేసి వేగాక ఎండుమిర్చి, కరివేపాకు వేసి దోరగా వేయించాక, గ్రేవీలో కలపాలి.