- Step 1
శనగపప్పును అరగంటసేపు నానబెట్టి నీరు వంపేయాలి.
- Step 2
అందులో పచ్చికొబ్బరితురుము, పచ్చిమిర్చి, అల్లం, ధనియాలు, జీలకర్ర, ఇంగువ అన్నీ కలిపి గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోవాలి.
- Step 3
శుభ్రంగా కడికిన ఉల్లికాడలను మెత్తగా ఉడికించాలి.
- Step 4
గ్రైండ్ చేసుకున్న మిశ్రమం, తగినంత నీరు పోసి మెత్తగా మరో పదినిముషాలు ఉడికించాలి.
- Step 5
స్టౌ మీద బాణలి పెట్టి టీ స్పూను నెయ్యి వేసి వేడయ్యాక అందులో ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మెంతులు, మినప్పప్పు, పసుపు, ఇంగువ, కరివేపాకు వేసి వేయించి దానిని ఉడికించిన మిశ్రమంలో వేయాలి.
- Step 6
తరవాత స్టౌవ్ మించి దించి ఈ మొత్తాన్ని పెరుగులో వేసి చివరగా ఉప్పు వేసి బాగా కలపాలి.
- Step 7
చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. ఇది అన్నం, చపాతీ, పూరీ, దోసెలతో తీసుకోవచ్చు.
- Step 8
ఇందులో పావుకప్పు కారాబూందీ కూడా పైన చల్లుకోవచ్చు.