- Step 1
ముందుగా పాలకూరను మెత్తగా ఉడికించి, చల్లారిన తరవాత కొద్దిగా ఉప్పు జత చేసి మెత్తగా పేస్ట్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి.
- Step 2
పాన్‌లో టీ స్పూను నూనె కాగిన తరవాత అందులో జీలకర్ర వేసి దోరగా వేగాక మైదా వేసి పచ్చివాసన పోయేవరకు వేయించి దింపి, ఈ మిశ్రమాన్ని పాలకూర పేస్ట్‌లో వేసి కోఫ్తా(బాల్స్ మాదిరి)లా తయారుచేసుకోవాలి.
- Step 3
పాన్‌లో నూనె కాగిన తరవాత అందులో ఈ కోఫ్తాలను డీప్ ఫ్రై చేసి తీసి పక్కన ఉంచుకోవాలి.
- Step 4
జీడిపప్పులో తగినంత నీరు పోసి పేస్ట్ (మరీ పల్చగా ఉండకూడదు) చేయాలి.
- Step 5
ఒక పాన్‌లో ఈ పేస్ట్ వేసి కొద్దిగా ఉడికిన తరవాత ఏలకులపొడి, ధనియాలపొడి, కసూరీ మేథీ, స్వీట్ క్రీమ్ వేసి రెండు నిముషాలు ఉడికించితే గ్రేవీ తయారవుతుంది.
- Step 6
ఇందులో పాలక్ కోఫ్తాలు వేసి ఐదునిముషాలు ఉంచితే పాలక్ కాశ్మీర్ కోఫ్తా రెడీ అయినట్లే.