- Step 1
బీట్‌రూట్ ముక్కలను కుకర్‌లో మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలి.
- Step 2
కొబ్బరి, జీడిపప్పు, వెల్లుల్లి, అల్లం, కొద్దిగా నీరు కలిపి గ్రైండ్ చేసుకోవాలి.
- Step 3
ఒక బాణలిలో నూనె వేడి చేసి, జీలకర్ర వేసి చిటపటలాడాక, సన్నగా తరిగిన ఉల్లితరుగు వేసి వేయించాలి.
- Step 4
తరువాత గ్రైండ్ చేసిన మిశ్రమం కూడా వేసి కొద్దిగా నీళ్లు పోసి కాసేపు ఉడికించాలి.
- Step 5
చివరగా బీట్‌రూట్, ఉప్పు,కారం, కొత్తిమీర కూడా వేసి రెండు నిముషాలు ఉడికించి దించేయాలి.
- Step 6
బీట్‌రూట్ కుర్మా (beetroot kurma) చపాతీలలోకి, బిరియానీలోకి రుచిగా ఉంటుంది.