- Step 1
ఒక నాన్‌స్టిక్ పెనం తీసుకుని అందులో నూనె వేసి వేడి చేయాలి.
- Step 2
అందులో బ్లాక్ పెప్పర్, ధనియాల పొ డి, జీలకర్ర పొడులు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ తరుగులను వేసి వేయించాలి.
- Step 3
ఉల్లిపాయలు బాగా వేగిన తరువాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలియబెట్టాలి.
- Step 4
ఇందు లోనే వేరుశెనగ గింజల పొడి, పసు పుపొ డి, తగినంత ఉప్పువేసి బాగా కలిపి వేయించాలి. తరువాత దానికి పనస, బంగాళా దుంపల మిశ్రమాలను చేర్చి బాగా కలిపి వేయించాలి.
- Step 5
చివరగా స్కిమ్‌డ్ మిల్క్ చేర్చి బాగా కలిపి అవి ఇగిరేంతదాకా సన్నటి మంట పై ఉడికించాలి.
- Step 6
మిశ్రమం అంతా దగ్గర ప డ్డాక కొత్తిమీర తరుగును వేసి బాగా కలిపాలి.
- Step 7
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కిందికి దించి చల్లారి న తరువాత ఉండలుగా చుట్టి, టొమోటో చ ట్నీ లేదా జామ్‌తో కలిసి సర్వ్ చేయాలి.
- Step 8
అంతే రుచికరమైన పనస మసాలా బాల్స్ రెడీ.
- Step 9
తక్కువ నూనెతో తయారయ్యే ఇవి తక్కువ కొవ్వును కలిగి ఉంటాయి. ముఖ్యంగా డైటిం గ్ చేసేవారికి ఇవి బాగా తోడ్పడతాయి.