- Step 1
ముందుగా పనీర్ టొమాటోలూ, క్యాప్సికం, పచ్చిమిర్చి, కొత్తిమీరను విడివిడిగా సన్నగా తరిగి పెట్టుకోవాలి.
- Step 2
పెనం వేడిచేసి దానిపై పిండిని పల్చని దోశలా పరవాలి.
- Step 3
మధ్యలో చెంచా వెన్న దానిపై ఉల్లిపాయ , క్యాబేజీ, టొమాటో ముక్కలు చెంచా చొప్పునా కొద్దిగా క్యాప్సికం, పచ్చి మిర్చి ముక్కల్ని వేసేయాలి.
- Step 4
ఇప్పుడు కొంచెం సోయా సాస్, కొద్దిగా కారం, గరం మసాలా దోశంతా పడేలా చల్లాలి.
- Step 5
ఈ ముక్కలపై కొద్దిగా టొమాటో సాస్, పనీర్ తరగూ, తగినంత ఉప్పు, ఉల్లికాడల తరుగూ కొద్దిగా నూనె వేసుకుని దోశలా కాల్చుకోవాలి.
- Step 6
దానిపైన మళ్లీ కొద్దిగా వెన్న, కొత్తిమీర తరుగూ చీజ్ ముక్కలూ వేస్తే సరిపోతుంది.
- Step 7
దోశను మధ్యకు మడిచి పళ్లెంలోకి తీసుకుని కొబ్బరి చట్నీతో కలిపి వడ్డించాలి. ఇలా మిగిలిన పిండినీ చేసుకోవాలి.