- Step 1
డాల్డాలో ఉల్లిపాయ ముక్కలు దోరగా వేయించి విడిగా పెట్టుకోవాలి. కడిగిన చికెన్‌ను పెద్ద గిన్నెలో వేసుకోవాలి.
- Step 2
దానికి పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, వేయించిన ఉల్లిగడ్డముక్కలు సగం, ఉప్పు, కారం, పచ్చిమిర్చి ముక్కలు, నిమ్మకాయ రసం, పెరుగు, లవంగాలు, యాలుకలు, దాల్చిన చెక్క, షాజీర, డాల్డా కూడా కొంచెం కలిపి ఒక గంట నానబెట్టాలి.
- Step 3
తర్వాత బియ్యం సగం ఉడికాక (అంటే అన్నం పలుకుగా వుండాలి) నీళ్లు మొత్తం వొంపేయాలి.
- Step 4
ఆ బియ్యాన్ని, దినుసులన్నీ కలిపిన చికెన్ మిశ్రమం పైన వేయాలి.
- Step 5
మిగిలిన డాల్డా, కొంచెం కొత్తిమీర, పుదీనా ఆకులు, వేపిన ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా నిమ్మకాయ రసం కూడా బియ్యం పైన వేసి పది నిమిషాలు ఉడికించాలి.
- Step 6
ఆ తర్వాత సన్న సెగ మీద మరో పదినిమిషాలు ఉంటే చాలు. ఉడికేటప్పుడు ఆవిరి పోకుండా చూసుకోవాలి. అంతే ఘుమఘుమలాడే చికెన్ బిర్యానీ రెడీ.
- Step 7
తినేముందు చికెన్... అన్నం కలిసేలా కలియదిప్పాలి. మటన్ బిర్యానీ కూడా ఇలాగే చేసుకోవచ్చు.