- Step 1
ముందుగా బోన్‌లెస్ చికెన్‌ని తీసుకుని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
- Step 2
ఒక పాన్‌లో నూనె లేదా నెయ్యిని వేసి అది కాగాక అందులో ఉల్లిపాయ తరుగు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి.
- Step 3
తర్వాత అందులో గ్రైండ్ చేసిన అల్లంవెల్లుల్లి ముద్ద, పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి వేసి తిరిగి కాసేపు వేయించి టొమాటో ముక్కలు కలిపి తక్కువ సెగ మీద పెట్టాలి.
- Step 4
అందులో మెత్తగా పేస్ట్ చేసుకున్న జీడిపప్పు, పుచ్చగింజల మిశ్రమం, ఫ్రెష్ క్రీమ్ తగినన్ని నీళ్లు, ఉప్పు, గరం మసాల పౌడర్ వేసి ఉడుకుతుండగా అందులో తరిగిన సోయా బాజీ ఆకులు లేదా కొత్తిమీర తరుగు, చికెన్ ముక్కలు వేసి తక్కువ సెగ మీద మూత పెట్టి ఉడికించాలి.
- Step 5
ఈ మిశ్రమం దగ్గరగా వస్తుండగా అందులో పచ్చిమిర్చి ముద్ద వేసి రెండు నిమిషాలపాటు ఉంచి బౌల్‌లోకి తీసుకుని సోయా బాజీ ఆకులతో కాని కొత్తిమీరతో కాని గార్నిష్ చేయాలి.
- Step 6
ఈ డిష్‌ని రైస్ ఐటమ్స్‌తో కాని రోటీస్‌తో కాని తింటే రుచిగా ఉంటుంది.