- Step 1
ముందుగా చికెన్ ని శుబ్రపరుచుకోవాలి.
- Step 2
పాన్ లో నెయ్యివేడి చేసి సేమ్యాని దోరగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి
- Step 3
అదే పాన్ లో మరికాస్త నెయ్యి వేసి దానిలో లవంగాలు, యాలుకలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించండి.అవి వేగాక ఉల్లి ముక్కలు వేసి కాసేపు వేయించాక అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పచ్చివాసన పోయేవరకు వేయించాలి.
- Step 4
ఇప్పుడు చికెన్ ముక్కలు, టమాట ముక్కలు వేసి ఒక సారి కలిపి దీనిలో కారం, గరం మషాల,ఉప్పు వేసి చికెన్ మెత్తగా ఉడికే వరకు ఉంచలి.
- Step 1
ఇప్పుడు వేయించిన సేమ్యా వేసి కలిపి రెండు కప్పుల నీళ్ళు వేసి ఉడికించాలి నీళ్ళు మొత్తం ఇగిరి పోయాక జీడిపప్పు, కిస్మిస్లు, సోయాబిన్ సాస్ వేసి కలిపి పోడి పొడిగా అయ్యేదాకా ఉంచి కొత్తిమీర వేసి దించాలి. అంతే రుచికరమైన సేమ్యా చికెన్ బిర్యాని రెడీ