- Step 1
పసుపు, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎండుమిరపకాయలు పేస్ట్, గుడ్లు, సగం నిమ్మ రసం, ఉప్పు కలిపి చికెన్ ముక్కలు నానపెట్టాలి.
- Step 2
ఈ ముక్కలను కొంచెం సేపు నూనె లో వేయించుకొని పక్కన పెట్టుకోవాలి.
- Step 3
ఇంకొక భాండి లో నూనె వేసి బాగా వేడి అయిన తర్వాత ఆవాలు, వెల్లుల్లి ముక్కలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి వేగనివ్వాలి.
- Step 4
అందులో ఉల్లిపాయ, క్యాప్సికం ముక్కలు, కారం, ధనియాల పొడి వేసి కొద్ది సేపు ఉంచాలి.
- Step 5
మిశ్రమము లో చికెన్ కలుపుకొని, కొత్తిమీర, మిగతా నిమ్మరసం కలుపుకోవాలి. వేడివేడిగా కోడి వేపుడు అదుర్స్.