- Step 1
పండుగప్ప చేపను శుభ్రం చేసుకుని ముక్కలు చేసుకోవాలి.
- Step 2
వీటిలో అల్లంవెల్లుల్లి పేస్టు, ఉప్పు, పసుపు, కారం, కొద్దిగా నూనె వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని ఓ గంట అలాగే ఉంచాలి.
- Step 3
ఇలా మాగేట్ చేసి పెట్టుకున్న చేపముక్కల్ని వేయించే ముందు ఒకసారి మళ్లీ కలుపుకోవాలి. పొయ్యి వెలిగించి చిన్న మూకుడు పెట్టి రెండు ముక్కలు వేగడానికి సరిపడా నూనె పోసుకుని వేడి చెయ్యాలి.
- Step 4
రెండు ముక్కల చొప్పున వేపి పక్కన పెట్టుకోవాలి.
- Step 5
అదే మూకుడులోనే ఉల్లిపాయలు వేగడానికి అవసరమైన నూనె మాత్రమే ఉంచి మిగిలింది తీసివేయాలి.
- Step 6
అందులో ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేపాలి.
- Step 7
ఉల్లిపాయ ముక్కలకు పట్టడానికి అందులో కొద్దిగా ఉప్పు, కారం, పసుపు వేయాలి.
- Step 8
కొత్తిమీర తురుము, ధనియాలు, జీలకర్ర పొడి కూడా వేసుకొని ఆఖరులో వేపి పెట్టుకున్న ముక్కల్ని వేసి గరిటెతో ముక్క చితకకుండా తిప్పుకోవాలి.
- Step 9
అంతే పండుగప్ప ఫ్రై రెడీ. చాలా రుచిగా ఉంటుంది.