- Step 1
ముందుగా చేపలను కల్లుప్పుతో రుద్ది శుభ్రం చేసుకోవాలి. అప్పుడే జిగురు లేకుండా ఉంటాయి.
- Step 2
వాటికి పసుపు, ఉప్పు, కారం చెంచా చేప మసాలా పొడిని కలిపి పక్కన పెట్టుకోవాలి.
- Step 3
పది నిమిషాల పాటు ఉంచితే ముక్కలకు ఉప్పు, కారం చక్కగా పడుతుంది.
- Step 4
ఇప్పుడు కడాయిలో నూనె వేడిచేసి నిలువుగా చీల్చి పెట్టుకున్న పచ్చి మిర్చి ఉల్లిపాయ ముక్కలు దోరగా వేయించి బాణలితోపాటు తీసి పెట్టుకోవాలి.
- Step 5
వేడి కొద్దిగా తగ్గాక అందులో కారం పట్టించిన చేపముక్కలును వాటిపై సర్దాలి.
- Step 6
ఇలా చల్లారిన తర్వాత చేప ముక్కలని వేయడం వల్ల చేప వేడికి విడిపోకుండా ఉంటుంది.
- Step 7
ఆ బాణలిలో అరగ్లాసు నీళ్లు, కరివేపాకు వేసి పొయ్యి మీద పెట్టాలి.
- Step 8
అది మరుగుతుండగా చింతపండు రసాన్ని ముక్కలకు తగ్గట్టుగా వేసుకుని ఆ తరువాత తగినంత ఉప్పు చేర్చాలి.
- Step 9
ముక్క బాగా ఉడికి చక్కగా వాసన వస్తుండగా అందులో మిగిలిన చేప మసాలాను వేసి దింపేయాలి.
- Step 10
దానిపై కొద్దిగా కొత్తిమీర వేసి అలంకరించుకొంటే చేపల పులుసు సిద్ధం. వేడివేడిగా లేదా బాగా చల్లారిన తర్వాత ... ఎలా తిన్నా రుచిగానే ఉంటుంది