- Step 1
పాన్‌లో నూనె పోసి వేడెక్కాక ఆవాలు, మెంతులు వేయాలి.
- Step 2
అవి చిటపటలాడుతుండగా ఉల్లిపాయ తరుగు, వెల్లుల్లి తరుగు, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు వేసి తిప్పి అందులో అల్లంవెల్లుల్లి ముద్ద, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, ఎండుమిర్చి వేసి ఎరుపురంగు వచ్చేవరకు వేయించాలి.
- Step 3
ఈ మిశ్రమంలో టొమాటో గుజ్జు, కొబ్బరి పేస్ట్ వేసి రెండు నిమిషాలపాటు తిప్పి తగినన్ని నీళ్లు, తగినంత ఉప్పు వేసి అయిదారు నిమిషాలు ఉడకనివ్వాలి.
- Step 4
ఇప్పుడు అందులో పచ్చి మామిడి ముక్కలు లేదా చింతపండు పలుసు, శుభ్రపరిచిన చేప ముక్కలు వేసి అన్నిటినీ బాగా కలిపి సన్నని సెగ మీద మూతపెట్టి ఉడికించాలి.
- Step 5
కూర చిక్కబడ్డాక గిన్నెలోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేయాలి.
- Step 6
ఈ నెల్లూరి చేపల పులుసు వేడి వేడి అన్నంతో పసందుగా ఉంటుంది.