- Step 1
ముందుగా కోడిగ్రుడ్లను ఉడికించి నిలువగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
- Step 2
అలాగే కుంకుమ పువ్వును గోరువెచ్చని పాలలో నానబెట్టుకోవాలి. ఇంకా బిర్యానీకి మసాలా ఎలా తయారు చేసుకోవాలంటే..? లవంగాలు, దాల్చిన చెక్క, షాజీరా, మిరియాలను పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
- Step 3
బాస్మతి బియ్యంలో సరిపడా నీటిని పోసి, అందులో ఏలకులు, లవంగాలు, బిర్యానీ ఆకులు, పుదినా, కాసింత ఉప్పు వేసి వండుకోవాలి.
- Step 4
తర్వాత ఉడికించిన అన్నాన్ని వెడల్పాటి పాత్రలోకి తీసుకుని చల్లార్చాలి.
- Step 5
తర్వాత ఓ పాత్రలో నెయ్యి వేసి వేడయ్యాక ఉల్లిపాయలు వేసి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించాలి.
- Step 6
ఉల్లిపాయలు వేగాక, పచ్చిమిర్చి అల్లం, వెల్లుల్లి ముద్ద ఒకదాని తరువాత ఒకటి వేసి 2 నిమిషాలు వేపాలి.
- Step 7
తర్వాత కారం, బిర్యానీ మసాలా, ధనియాల పొడి, ఉప్పు వేసి కలియబెట్టాలి.
- Step 8
ఈ మిశ్రమంలో టమోటా, కోడిగ్రుడ్లు వేసి మసాలా కలిసేలా వేపుకోవాలి.
- Step 9
ఇందులో పెరుగు, నిమ్మరసం వేసి ఏడు నిమిషాల పాటు వేపి స్టౌ మీద నుంచి దింపి పక్కనబెట్టుకోవాలి.
- Step 10
అనంతరం ఒక వెడల్పాటి పాత్రను తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్ లేదా నెయ్యి వేసి ఉడికించుకున్న అన్నాన్ని వేయాలి.
- Step 11
రైస్ మీద కోడిగుడ్డుతో చేసిన మసాలా వేసి స్ర్పెడ్ చేయాలి.
- Step 14
ఆపై నెయ్యి, పాలలో నానబెట్టిన కుంకుమపువ్వు చిలకరించి, కొత్తిమీర చల్లి మూత పెట్టి పదినిమిషాల పాటు ఉడికించి దింపేయాలి.
- Step 15
అంతే ఎగ్ బిర్యానీ రెడీ..!. ఈ బిర్యానీని మీకు ఇష్టమైన చికెన్ కర్రీ లేదా బ్రింజాల్ కర్రీతో వేడి వేడిగా సర్వ్ చేయొచ్చు.