- Step 1
ముందుగా చికెన్ పీసెస్‌ని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
- Step 2
ఒక బౌల్‌లో శనగపిండి, బియ్యంపిండి వేసి కాస్త నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి.
- Step 3
స్టౌ మీద పాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడ నూనె వేసి కాగాక పైన కలుపుకున్న మిశ్రమంలో చికెన్ ముక్కలను ముంచి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి.
- Step 4
ఇప్పుడు గ్రేవీ కోసం పక్కన ఒక పాన్‌లో కాస్త నూనె వేసి వేడెక్కాక కట్ చేసుకున్న పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు, అల్లం, వెల్లుల్లి ముక్కలను వేయాలి.
- Step 5
ఇవి వేగుతూ ఉండగా అందులో ఉల్లిపాయ తరుగు, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి అందులో టొమాటో ముక్కలు కూడా వేసి బాగా కలపాలి.
- Step 6
ఈ మిశ్రమాన్ని తక్కువ సెగ మీద పెట్టి చివరగా చిలికిన పెరుగు, కొత్తిమీర, ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్‌ని కూడా వేసి కలిపి వెంటనే బౌల్‌లోకి తీసుకోవాలి.
- Step 7
కలర్‌ఫుల్‌గా ఇష్టపడేవాళ్లు ఎరుపు రంగు ఫుడ్ కలర్‌ని వేసుకుంటే ఆకర్షణీయంగా ఉంటుంది. చట్‌పటా ముర్గ్‌ను స్టార్టర్స్‌లా లేదా స్నాక్స్‌లా ఇష్టపడతారు.