- Step 1
ముందుగా చికెన్ బ్రెస్ట్ పీస్‌ని శుభ్రంగా కడిగి పలుచని స్లైసస్‌గా కట్ చేసుకోవాలి.
- Step 2
ముక్కల మీద శనగపిండి చల్లి చేత్తో కలపాలి. శనగపిండి ముక్కల్లో తడిని పీల్చుకోవడమే కాక పచ్చివాసనని కూడా తగ్గిస్తుంది.
- Step 3
ఇప్పుడు ఒక బౌల్‌లో చికెన్ పీసెస్, అల్లంవెల్లుల్లి ముద్ద, వెనిగర్, గుడ్డు సొన, కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరమ్ మసాల పౌడర్, నిమ్మరసం కలిపి 10 నిమిషాలపాటు నానబెట్టాలి.
- Step 4
తర్వాత నాన్ స్టిక్ పాన్ లేదా తవా ని స్టౌ మీద పెట్టి నూనె వేయాలి.
- Step 5
నూనె వేడెక్కాక నానబెట్టిన చికెన్ ముక్కలని వేసి తక్కువ సెగ మీద ఎరుపు రంగు వచ్చే వరకు వేయించి తీసుకోవాలి.
- Step 6
వీటిని లంచ్ లేదా డిన్నర్‌కి ముందు స్టార్టర్స్‌లా తీసుకోవచ్చు.