- Step 1
మరిగే నీళ్లలో మీల్ మేకర్ పది నిమిషాలు ఉడికించాలి.
- Step 2
అల్లం వెల్లుల్లి పేస్ట్ , పచ్చిమిర్చి, క్యారెట్, బఠాణీలు ఉడికించాలి. అందులో మైదా, కార్న్‌ఫ్లోర్, సోయాసాస్, అజినమోటో, ఉప్పు, వెనిగర్ వేసుకోవాలి.
- Step 3
ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. వీటిని కాగిన నూనెలో వేయించి పక్కన పెట్టుకోవాలి.
- Step 4
బాండీలో కొద్దిగా నూనె వేడి చేసి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, వెల్లుల్లి వేయించాలి.
- Step 5
అందులోనే వేయించిన మంచూరియా వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి.
- Step 6
పైన కొత్తిమీర చల్లుకుంటే చాలు... నోరూరించే మీల్ మేకర్ మంచూరియా రెడీ.