- Step 1
కోడి మాంసాన్ని శుభ్రం చేసుకొని దాన్ని కొంచెం ఉప్పు, పసుపు కలిపిన నీళ్ళల్లో ఉడికించి కొన్ని నీళ్లు ఉండగానే దింపేయాలి.
- Step 2
మొత్తం అల్లంలోని మూడో వంతు భాగాన్ని తీసి తురిమి ఉంచుకోవాలి. మిగిలిన అల్లాన్నంతటికీ మెత్తగా నూరుకోవాలి.
- Step 3
కడాయిలో నూనె వేసి అల్లం పేస్టును వేసి కాఫీ కలర్ వచ్చేదాకా బాగా వేయించాలి.
- Step 4
తరువాత దానికి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టొమోటో ముక్కలు, ఉప్పు, పసుపు కలిపి వేయించాలి.
- Step 5
టొమోటోలు బాగా ఉడికిన తరువాత దానికి కారం, పెరుగు, అల్లం తురుము, ఉడికించిన మాంసం వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలియబెట్టాలి.
- Step 6
నీళ్ళన్నీ బాగా ఇగిరిపోయేదాకా కూరను బాగా ఉడికించి దించేముందు కొత్తిమీర చల్లి దించుకోవాలి.
- Step 7
అంతే వేడి వేడి దంకా జిగర్ చికెన్ రెడీ. ఇది చపాతీ, పరోటాలలోకి చాలా బాగుంటుంది.