- Step 1
బోన్‌లెస్ చికెన్‌ని ఖైమా కొట్టించుకోవాలి. మామూలు చికెన్‌ని కడిగి పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు కలిపి నాననివ్వాలి.
- Step 2
గిన్నెలో నూనె కాగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని దోరగా వేయించాలి.
- Step 3
చికెన్ ముక్కల్ని కూడా అందులో వేయాలి. ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి కలియదిప్పి ఉడికించాలి.
- Step 4
కొద్దిగా ఉడికాక ఖైమా, టమాటా గుజ్జు, జీలకర్ర పొడి, గరం మసాలా కలిపి పావుగంట ఉడికించాలి.
- Step 5
దించేముందు గసగసాల పేస్టు, జీడిపప్పు పేస్టు, కొత్తిమీర చల్లుకోవాలి.అంతే రుచిరకమైన గోదావరి చికెన్ కర్రీ రెడీ .