- Step 1
ప్యాన్ లో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లి పాయలు వేసి మెత్తబడేవరకు వేయించాలి.
- Step 2
ఇప్పుడు పసుపు,కరివేపాకు, అల్లం, వెల్లుల్లి పేస్ట్, కారంపొడి వేసి కొద్దిగా వేపి కడిగి పెట్టు కున్న మాంసం ముక్కలు, తగినంత ఉప్పు వేసి బాగా కలియబెట్టి మూత పెట్టాలి.
- Step 3
నీరంతా ఇగిరిపో యాక ఆరకప్పు నీరు పోసి మూతపెట్టి నిదానం గా ఉడికించాలి.
- Step 4
ముక్కలు ఉడికిన తర్వాత కొబ్బ రిపొడి, మిరియాలపొడి వేసి మరో ఐదు నిమి షాలు ఉడికించి నూనె తేలాక గరం మసాలా వేసి దింపేయాలి.
- Step 5
ఈ కూర అన్నంలోకి, చపాతీ ల్లోకి బావుంటుంది. కారం మీ ఇష్టాన్ని బట్టి ఎక్కువ, తక్కువ వేసుకోవచ్చు.