- Step 1
ముందుగా చికెన్‌ను శుభ్రం చేసుకొని ఉప్పు, కారం, పసుపు, అల్లంవెల్లుల్లి పేస్ట్, తరిగిన కొత్తిమీర, పుదినా మిశ్రమం వేసి బాగా కలిపి అరగంటసేపు ఉంచాలి.
- Step 2
నువ్వుల్ని దోరగా వేయించి మిక్సీ వేసుకోవాలి. గిన్నెలో నూనె వేసి వేడెక్కాక ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగనివ్వాలి.
- Step 3
అందులోనే ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ మిశ్రమాన్ని వేసి నీరంతా ఇగరనివ్వాలి. తర్వాత కొద్దిగా నీరు పోసి సన్న సెగమీద మగ్గనివ్వాలి. చివరిలో గరంమసాలా, నువ్వుల పొడి వేసి కొద్దిసేపు ఉడకనివ్వాలి.
- Step 4
అంతే చికెన్ కర్రీ రెడీ. ఇది చపాతీల్లోకి, అన్నంలోకి బాగుంటుంది.
- Step 5
కొందరు జీడిపప్పు పేస్ట్ వేస్తారు. దానికన్నా నువ్వుల పేస్ట్ రుచిగా ఉంటుంది. ఖరీదు తక్కువ, ఆరోగ్యం. నువ్వులు చికెన్ కర్రీ.