- Step 1
చికెన్ ముక్కల్ని కడిగి నిమ్మరసం, అల్లం, ఉప్పు వేసి కలిపి పావుగంట సేపు నానబెట్టాలి.
- Step 2
ఒక గిన్నెలో పెరుగు, జాజికాయ, జాపత్రి, కారం, జీలకర్రపొడి, మిరియాల పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి.
- Step 3
ఈ మిశ్రమాన్ని చికెన్ ముక్కలకు పట్టించాలి. క్యాప్సికం, టొమాటోలను కూడా పెద్ద ముక్కలుగా కోసి చికెన్ ముక్కల్లో కలిపి 15 నిమిషాలు నానబెట్టాలి.
- Step 4
ఇప్పుడు ఓ ఇనుప చువ్వకు చికెన్, క్యాప్సికం, టొమాటో ముక్కలు కలిపి గుచ్చి నిప్పులమీద ఓ పది నిమిషాలు కాల్చాలి.
- Step 5
తరువాత తీసి వేడిగా పుదీనా చట్నీతో వడ్డించాలి.