- Step 1
కార్న్‌ఫ్లోర్, మైదాపిండి, ఉప్పు, మిరియాల పొడి, వెనిగర్, సోయాసాస్‌లను కలిపి... అందులో కడిగిన చికెన్ ముక్కల్ని వేయాలి.
- Step 2
ఈ మిశ్రమాన్ని బాగా కలిపి అరగంట నాననివ్వాలి. బాండీలో నూనె వేడిచేసి ఈ చికెన్ ముక్కల్ని వేయించాలి.
- Step 3
తర్వాత అదే బాండీలో కొంచెం నూనె వుంచుకుని పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఉల్లికాడ ముక్కలు, సోయాసాస్, పంచదార, చికెన్ స్టాక్, టమాటా సాస్, ఉప్పు, మిరియాల పొడి, అజినమోటో వేసి కలపాలి.
- Step 4
కొద్దిగా చిక్కబడిన తర్వాత ముందు వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కలు అందులో వేసి ఆ మిశ్రమం ముక్కలకు పట్టేవరకు కలపాలి.
- Step 5
అంతే రుచికరమైన చికెన్ మంచూరియా రెడీ.