- Step 1
చికెన్ ముక్కల్ని శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేయండి.
- Step 2
తరువాత అందులో దంచిన మిరియాలపొడి ,పెరుగు,కొంచెం అల్లంవెల్లుల్లిముద్ద,నిమ్మకాయరసం,తగినంత ఉప్పు వేసి చికెన్ ముక్కలకు బాగా అంటేలా పట్టించి అరగంట సేపు నానబెట్టండి.
- Step 3
తరువాత స్టవ్ మీద ఉంచిన గిన్నెలో నూనె పోసి కాచక ముందుగా ఉల్లిపాయ ముక్కలని ఫ్రై చేసాక ,మిగిలిన అల్లంవెల్లుల్లి.
- Step 4
ముద్దను ,కారం.టమోటాముక్కలని వేసి కలుపుతూ నూనె పైకి తేలే వరకు ఉడికించండి.
- Step 5
ఇప్పుడు అదే గిన్నెలో నానబెట్టిన చికెన్ ముక్కలని వేసి,కలియబెట్టిన గిన్నె మీద మూత పెట్టి ఉడికించండి.
- Step 6
చికెన్ ఉడక గానే గరంమసాలా పొడి,కొత్తి మీరా ,కరివేపాకు వేసి,దించి వేడివేడిగా రైస్ తో వడ్డించండి.
- Step 7
అంతే చెట్టినాడు చికెన్ రెడీ
.