- Step 1
చికెన్ వేయించి పెట్టుకోవాలి.
- Step 2
ఒక గిన్నెలో సరిపడా నూనె వేసి బాగా కాగాక అల్లంవెల్లుల్లి ముద్ద, చికెన్ ముక్కలు కూడా వేసి వేయించాలి.
- Step 3
ఉప్పు, కారం, ధనియాల పొడి బాగా కలిపి కొద్దిగా నీళ్లు పోసి సన్నని మంటపై మెత్తగా ఉడికించాలి.
- Step 4
నీరంతా పోయాక దించి పక్కన పెట్టుకోవాలి.
- Step 5
పొయ్యి మీద మరో గిన్నె పెట్టి సరిపడా నూనె పోసి మధ్యగా కోసిన వంకాయ ముక్కల్ని వేయించి పక్కన పెట్టుకోవాలి.
- Step 6
అదే నూనెలో వెల్లుల్లి రేకలు, టమాటా గుజ్జు వేసి బాగా వేయించాలి. ఉప్పు,కారం, వేయించిన చికెన్ వేసి సన్నమంట మీద పావుగంట ఉడికించి దించేయాలి.
- Step 7
ఈ కూరని వంకాయ ముక్కలపై వేసి అలంకరించుకోవాలి.