- Step 1
బియ్యం పూర్తిగా ఉడకక ముందు పొడిపొడిగా ఉన్న సమయంలోనే తీసి, తగినంత ఉప్పు కలిపి ఉడకబెట్టుకోవాలి.
- Step 2
అన్నంను ఓ పాత్రలో తీసుకుని ఆరబెట్టాలి. స్టవ్‌పై బాణలి పెట్టి, నూనె కాగబెట్టాలి.
- Step 3
అందులో ఆవాలు, జీలకర్ర వేసి తాళింపులా చేయాలి. అందులోనే శెనగపప్పు, ఉద్దిపప్పు చేర్చి బాగా వేయించాలి.
- Step 4
తర్వాత ముక్కలుగా చేసినా పచ్చి మిరపకాయలు, ఉల్లి చేర్చి మిక్స్ చేసి, క్యారెట్ తురుమును అందులో చేర్చండి.
- Step 5
క్యారెట్ బాగా కలిసిన తర్వాత గరం మసాలా పొడి వేసి, పావు కప్పు నీళ్లు పోసి, క్యారెట్‌ను ఉడకబెట్టండి. ఈ మిశ్రమాన్ని ఉడకబెట్టిన అన్నంలో కలపండి.
- Step 6
వేయించిన వేరుశెనగ పప్పులను బద్దలుగా చేసి, అన్నంలో బాగా కలపండి. ఇక కరివేపాకు, కొత్తిమీరలను పైపైన చల్లి, వేడిగా వడ్డించండి.