- Step 1
ముందుగా ప్రాన్స్‌ని శుభ్రంగా కడిగి వేడినీటిలో ఒక మోస్తరుగా ఉడికించి పక్కనపెట్టుకోవాలి.
- Step 2
ఒక గిన్నెలో అర టీ స్పూన్ అజినమోటో, ఉప్పు, అర టీ స్పూన్ మిరియాల పొడి, కోడిగుడ్డుసొన, కార్న్‌ఫ్లోర్, మైదాపిండి వేసి తగినంత నీటితో గరిటజారుగాకలుపుకోవాలి.
- Step 3
ఆ మిశ్రమంలో ఉడికించిన ప్రాన్స్ వేసి కలపాలి.
- Step 4
పాన్‌లో నూనె పోసి వేడయ్యాక కలిపిపెట్టుకున్న రొయ్యల మిశ్రమాన్ని పకోడీల్లా వేసుకుని వేయించి పక్కన పెట్టుకోవాలి.
- Step 5
ఇప్పుడు వేరొక పాన్ పెట్టుకుని పావు కప్పు నూనె వేసి వేడయ్యాక అందులో పచ్చిమిర్చి తరుగు, అల్లంవెల్లుల్లి తరుగు, అర టీ స్పూన్ అజినమోటో, అర టీ స్పూన్ మిరియాలపొడి, ఉప్పు, పసుపు, కారం వేసి దోరగా వేయించాలి.
- Step 6
ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న ప్రాన్స్ పకోడీని కూడా కలిపి తక్కువ సెగ మీద అయిదారు నిమిషాలు తిప్పి సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేస్తే ప్రాన్స్ మంచూరియా రెడీ...