- Step 1
ఒక పాత్రలో తగినంత ఉప్పు, నీళ్లు వేసి మరిగించాలి. పాస్తా జత చేసి, ఉడికించి, వడ కట్టాలి (కప్పుడు నీటిని పక్కన ఉంచాలి).
- Step 2
పెద్ద బాణలిలో ఆలివ్ ఆయిల్ వేసి కాగాక ముందుగా వెల్లుల్లి రేకలు, ఉల్లి తరుగు, రొయ్యలు వేసి దాని మీద మిరియాల పొడి, చిటికెడు ఉప్పు వేసి కలిపి మూత ఉంచి, రెండు నిమిషాలు ఉడికించాలి.
- Step 3
బాగా కలిపి మరో రెండు నిమిషాల తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. అదే బాణలిలో ఉడికించిన పాస్తా వేసి అడుగు అంటకుండా కలుపుతుండాలి.
- Step 4
టొమాటో తరుగు, సగం బేసిల్ ఆకులు, రెడ్ క్యాప్సికమ్ తరుగు, తగినంత ఉప్పు, పర్మేసన్ చీజ్ వేసి పదార్థాలన్నీ కొద్దిగా దగ్గరపడే వరకు ఉడికించాలి.
- Step 5
క్రీమ్ జత చేసి రెండు నిమిషాలు ఉడికించాలి.
- Step 6
ఉడికించి ఉంచుకున్న రొయ్యలు, పక్కన ఉంచుకున్న కప్పుడు నీళ్లు, ఉప్పు జత చేయాలి .
- Step 7
మిగిలిన బేసిల్ ఆకులు వేసి కలిపి వేడివేడిగా అందించాలి.