- Step 1
బాణలిలో కొద్దిగా నూనె వేసి, కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, గరం మసాలా వేసి వేయించాలి
- Step 2
పుదీనా ఆకు జత చేసి మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి
- Step 3
ఉల్లి తరుగు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి కొద్దిగా ఉడికించాలి.
- Step 4
కొబ్బరి తురుము, ధనియాల పొడి, మటన్, ఉప్పు వేసి బాగా కలిపి కొద్దిగా నీళ్లు జత చేసి మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి (అవసరమనుకుంటే కుకర్లో ఉడికించవచ్చు).
- Step 5
మటన్ ఉడికిన తర్వాత చింతచిగురు జత చేసి, బాగా కలిపి తడిపోయేవరకు ఉడికించాలి .
- Step 6
కొత్తిమీరతో గార్నిష్ చేసి వడ్డించాలి.