- Step 1
పాన్‌లో మంచినూనె వేసి వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, పొట్టుతీసిన వెల్లుల్లి, టొమాటో ముక్కలు, ఆవాలు వేసి వేయించాలి.
- Step 2
ఇవి ముదురు గోధుమ రంగు వచ్చేదాకా వేయించాలి. బాగా వేగిన తర్వాత మసాలా పొడిని వేసి బాగా కలియ బెట్టాలి.
- Step 3
దీంట్లోనే చింతపండు రసం, తగినంత నీరు పోసి మెత్తటి పేస్ట్‌లాగా ఉడికేంతదాకా ఉంచాలి.
- Step 4
తరువాత అందులో శుభ్రం చేసుకున్న రొయ్యలను వేసి బాగా కలియబెట్టాలి.
- Step 5
వాటికి బాగా మసాలా పట్టి, బాగా ఉడికేంతదాకా అలాగే తక్కువ మంటపైన ఉంచాలి.
- Step 6
చివరగా సరిపడా ఉప్పువేసి, పైన కొత్తిమీర చల్లి దించేయాలి.
- Step 7
ఇది వేడిగా ఉన్నప్పుడే రోటీల్లోకి సైడ్‌డిష్‌గా వాడుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది.