- Step 1
ముందుగా చింతపండు గుజ్జు తీసి పెట్టుకోవాలి.
- Step 2
పాన్ లో నూనెవేసి అది వేడి అయిన తరువాత వెల్లుల్లి రెబ్బలు వేయించుకుని పక్కన పెట్టాలి.
- Step 3
తరువాత అదే పాన్ లో నూనె వేసి సోంపు, మెంతులు, ఉల్లిపాయలు, కర్వేపాకు, పచ్చిమిర్చి వేసి 5 నిమిషాలు వేయించాలి.
- Step 4
ఇప్పుడు పసుపు, కారం, ఉప్పు, టమాటాల, వెల్లుల్లి పేస్ట్ ముందుగా వేయించుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి.
- Step 5
ఇందులో చింతపండు గుజ్జు, తగినన్ని నీళ్ళు పోసి 15 నిమిషాలు ఉడికించాలి.
- Step 6
వెల్లుల్లి బాగా ఉడికిన తరువాత చివరగా కొత్తిమీర వేసి దించాలి. అంతే ఆరోగ్యవంతమైన వెల్లుల్లి కర్రీ రెడీ.