- Step 1
ఓ పాత్రలోకి మాంసం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపులను వేసి బాగా కలిపి సరపడా నీటిని పోసి ప్రెజర్ కుక్కర్‌లో ఐదు నిమిషాల పాటు ఉడికించాలి.
- Step 2
మాంసం ముక్కలను తడి ఆరే వరకూ పక్కకు పెట్టుకోవాలి.
- Step 3
ఇప్పుడు స్టౌ వెలిగించి దానిపై బాణలి ఉంచి అందులో సరిపడా నూనె వేసి జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి (మధ్యలో కత్తిరిం చినవి) లను వేసి వేయించాలి.
- Step 4
ఇప్పు డు అందులోకి పక్కన పెట్టుకున్న మాంసంను కూడా వేసి బాగా కలియ బెట్టాలి.
- Step 5
ఈ మిశ్రమంపై మిరియాల పొడి, గరం మసాల పొడి, నిమ్మరసం వేసి బాగా కలిపి మరో ఐదు నుచి 10 నిమిషాల పాటు సన్నటి సెగ మీద ఉడికించాలి.
- Step 6
ముక్కలు బాగా వేగాయ ని నిర్ధారించుకున్నాక దించేసుకోవాలి.