- Step 1
పులస చేపని శుభ్రంచేసి కావలసిన సైజులో కట్‌చేసి పెట్టుకోవాలి. మెంతులు, ధనియాలు, జిలకర్ర, ఆవాలను మిక్సీలో వేసి మెత్తగా నూరుకోవాలి.
- Step 2
ఉల్లిపాయ, పచ్చిమిర్చిలను సన్నగా తరిగి ఉంచాలి.
- Step 3
పాన్ వేడయ్యాక నూనె వేసి అందులో ఉల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగులను వేసి వేయించాలి.
- Step 4
తరువాత అందులో మసాలా ముద్దను వేసి వేయించాలి. ఐదు నిమిషాల తరువాత చేప ముక్కలుల, ఆవనూనె, ఉప్పు, కారం వేసి వేయించాలి.
- Step 5
తరువాత తగినంత చింతపండు రసం పోసి ఉప్పు సరిజూసి ఉడికించాలి.
- Step 6
ముక్క ఉడికాక దించే ముందు వెన్న, కరివేపాకులను వేసి దించేయాలి. అంతే పులస పులుసు తయార్..!