- Step 1
రెండు ఉల్లిపాయలు ముక్కలు కోసి అందులో సగం నూనెలో వేయించి పక్కన పెట్టుకోవాలి.
- Step 2
శుభ్రంగా కడిగిన మటన్ ముక్కల్లో వేయించిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, కొత్తిమీర తురుము, పసుపు కలపాలి.
- Step 3
ఈ మిశ్రమాన్ని కుక్కర్‌లో ఉడికించాలి. వీటిని కాగిన నూనెలో వేయించి చల్లారనివ్వాలి.
- Step 4
తర్వాత మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. బాదం, చిరోంజి పప్పులను నానబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి.
- Step 5
ఇందులో కోడిగుడ్డు సొన కలపాలి. మెత్తగా గ్రైండ్ చేసుకున్న మటన్ మిశ్రమంలో మిగిలిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర తురుము, బాదం పప్పుల పేస్ట్‌కలపాలి.
- Step 6
ఈ మొత్తం మిశ్రమాన్ని చిన్న చిన్న వుండలు చేసుకుని వడల్లా చేసి కాగిన నూనెలో వేయిస్తే చాలు. నోరూరించే కబాబ్‌లు రెడీ.