- Step 1
రాగండి చేపల్ని శుభ్రం చేసుకుని ముక్కలు చేసుకోవాలి. పొయ్యి మీద చేపలగిన్నె పెట్టుకుని నూనె పోయాలి.
- Step 2
నూనె వేడెక్కాక ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత పసుపు, ఉప్పు, కారం, అల్లంవెల్లుల్లి పేస్టు వేసి వేపాలి.
- Step 3
అందులోనే చేప ముక్కల్ని వేసి ఉప్పు, కారం బాగా పట్టేలా కలపాలి. సన్న సెగమీద కాసేపు ఉడకనివ్వాలి.
- Step 4
ఆ తర్వాత చింతపండు పులుసు పోసి చేప ముక్కలు చితకకుండా కలపాలి.
- Step 5
మూతపెట్టి సన్న సెగమీద పులుసు చిక్కగా అయ్యేంతవరకు ఉడకనివ్వాలి.
- Step 6
ఆఖరులో ధనియాలు, జీలకర్ర పొడి వేసి గిన్నె కదపాలి.
- Step 7
ఆ తర్వాత కొత్తిమీర తురుము చల్లుకుని కొద్దిసేపు ఉంచి దించేయాలి. అంతే రాగండి చేపల పులుసు రెడీ.