- Step 1
ఒక పాత్రలో చేపలు, పసుపు, ఉప్పు, కారం వేసి కొద్దిసేపు ఊరనివ్వాలి .
- Step 2
బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక, ఉల్లి తరుగు, పచ్చి మిర్చి తరుగు వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాలి .
- Step 3
మెంతి కూర వేసి వేయించాక, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేవరకు కలపాలి.
- Step 4
ఊరబెట్టిన చేపలను జత చేసి జాగ్రత్తగా కలిపి మూతపెట్టి ఐదు నిమిషాలు ఉడికించాలి .
- Step 5
చింతపండు రసం, కొద్దిగా నీళ్లు వేసి మూత పెట్టి మరో ఐదు నిమిషాలు ఉడికించాలి .
- Step 6
చింతచిగురు వేసి కొద్దిసేపు ఉడకనివ్వాలి గరంమసాలా పొడి వేసి కలిపి రెండు నిమిషాలు ఉడకనిచ్చి దించేయాలి.