- Step 1
ముందుగా చేపముక్కలను శుభ్రపరిచి, వాటికి ఉప్పు రాసి పక్కన పెట్టుకోవాలి.
- Step 2
చింతపండు నానబెట్టి రసం తీసి దానిలో ఉప్పు, పసుపు కారం కలిపి పక్కన ఉంచాలి. మామిడికాయ పై తొక్క తీసి ముక్కలు చేయాలి.
- Step 3
ఉల్లిపాయలు, టొమాటోలు తరిగి ఉంచాలి. స్టౌ మీద మూకుడు ఉంచి మెంతులు, జీలకర్ర వేసి వేయించి దించాలి.
- Step 4
చల్లారక పొడి చేయాలి. మూకుడులో నూనె వేసి కాగాక, ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేగాక కరివేపాకు, చింతపండు రసం, టొమాటో ముక్కలు వేసి, కలిపి మూతపెట్టాలి.
- Step 5
ఐదు నిమిషాల తర్వాత చేపముక్కలను, మామిడికాయ ముక్కలను వేసి ఉడికించాలి.
- Step 6
తర్వాత జీలకర్ర, మెంతి పొడి వేసి, కలిపి, రసం కొంచెం చిక్కబడే వరకు ఉంచి, తర్వాత దించేయాలి.