- Step 1
చేపముక్కలను శుభ్రంగా కడిగి పక్కనపెట్టుకోవాలి.
- Step 2
స్టౌ మీద పాన్ పెట్టి రెండు టీ స్పూన్ల నూనె వేసి వేడెక్కాక అందులో కొబ్బరి ముద్ద, పచ్చిమిర్చి, ధనియాలపొడి, కారం, పసుపు తగినంత ఉప్పు వేసి రెండు నిమిషాలు వేయించాలి.
- Step 3
తర్వాత రెండు కప్పుల నీళ్లు పోసి మూతపెట్టాలి. ఈ మిశ్రమం కాస్త చిక్కపడ్డాక అందులో కట్ చేసిన ములక్కాయ ముక్కలు, చింతపండు గుజ్జుని పోసి సన్నటి సెగ మీద ఉంచాలి.
- Step 4
ఇది ఉడుకుతుండగా మధ్యలో చేప ముక్కలను కూడా జతచేసి మూతపెట్టాలి.
- Step 5
ఈ మిశ్రమమంతా దగ్గరగా వస్తుండగా దించి వేరొక పాన్‌లో మిగిలిన నూనె వేయాలి.
- Step 6
అది వేడెక్కాక అందులో జీలకర్రపొడి, కరివేపాకు, ఎండుమిర్చి వేసి తాలింపు పెట్టాలి.
- Step 7
వేయించిన తాలింపును ఉడికించిన కూరలో కలిపి సర్వింగ్ బౌల్‌లోకి తీసుకోవాలి.
- Step 8
ఈ కొరమీను ములక్కాయ కూరను వేడి వేడి అన్నంతో తింటే భలే రుచిగా ఉంటుంది.