- Step 1
ముందుగా చేపలను శుభ్రపరుచుకుని.. మీకు కావలసిన సైజులో కట్ చేసుకుని సిద్ధంగా ఉంచుకోవాలి.
- Step 2
ఈలోగా పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలను కూడా ముక్కలుగా చేసుకోవాలి.
- Step 3
అలాగే కొబ్బరి కోరుకుని పాలు తీసి పెట్టుకుని.. అల్లం, జీలకర్ర, వెల్లుల్లిపాయలు మెత్తగా నూరుకోవాలి.
- Step 4
ఇప్పుడు స్టౌమీద ఒక బాణలిలో నూనె పోసి అది బాగా కాగాక అందులో ఉల్లి, పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసి.. వేయించాక అందులో కారం, పసుపు, ఉప్పు, అల్లం ముద్ద, చేపముక్కలు వేసుకోవాలి. అలాగే ఒక పావుశేరు నీళ్లు కూడా పోయాలి.కొద్ది సేపు ఉడికిన తర్వాత కొబ్బరి పాలు పోసి మళ్లీ ఉడికించాలి.
- Step 5
ఈ మిశ్రమం బాగా ఉడికిన తర్వాత అందులో కొత్తమీర చల్లి దించేస్తే వేడివేడి చేపల ఇగురు రెడీ.