- Step 1
బాణలిలో నెయ్యి వేసి కాగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లితరుగు, పుదీనా ఆకులు, కొత్తిమీర, పచ్చిమిర్చిపేస్ట్, పెరుగు వేసి బాగా కలపాలి.
- Step 2
చిన్న పాత్రలో కొద్దిగా నూనె వేసి కాగాక అందులో గరంమసాలా, ఏలకులపొడి వేసి వేయించి, నిమ్మరసం, ఉలవచారు వేసి కలపాలి.
- Step 3
పెద్దపాత్రలో రెండు లీటర్ల నీళ్లు పోసి మరిగించాలి. బిరియానీ ఆకులు, పచ్చిమిర్చిపేస్ట్, ఉలవచారు మిశ్రమం, నానబెట్టి ఉంచుకున్న బియ్యం వేసి గరిటెతో కలిపి ఉడికించాలి.
- Step 4
అన్నం సగం ఉడికిన తర్వాత, నెయ్యి కరిగించి అన్నం మీద వేసి కలపాలి. మూత పెట్టి సుమారు 20 నిముషాలు ఉడికించాలి.
- Step 5
పుదీనా ఆకులు, ఉల్లిచక్రాలతో గార్నిష్ చేసి, వేడివేడిగా సర్వ్ చేయాలి.