- Step 1
ముందుగా పుదీనా ఆకులను తుంచుకొని బాగా కడగి పక్కన పెట్టుకోవాలి. ఈలోగా... రెండు కప్పుల బాస్మతి బియ్యం శుభ్రంగా కడిగి నాలుగు కప్పుల నీళ్ళు పోసి నానబెట్టు కోవాలి.
- Step 2
ఇప్పుడు పుదీనా ఆకులు, కొబ్బరి, పచ్చిమిర్చి, అరటీస్పూను ఉప్పును మిక్సీ గిన్నెలో వేసి మెత్తగా అయ్యే వరకూ గ్రైండ్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి.
- Step 3
ఇప్పుడు స్ట వ్ మీద ఓ మందపాటి గిన్నె లేదా కుక్కర్ పె ట్టి నెయ్యి వేసి అది మరిగాక మసాలా దిను సులు వేయాలి.
- Step 4
తర్వాత అల్లం వెల్లుల్లి ము ద్ద, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగావేయిం చుకోవాలి.
- Step 5
ఇవి వేగాక గ్రైండ్ చేసి ఉం చుకున్న పుదీనా పేస్టును వేసి రంగు మారే వరకూ వేయించుకోవాలి.
- Step 6
ఈ విశ్రమం ముదురాకుపచ్చ నుంచి లేతాకుపచ్చ రంగులోకి మారిన తర్వాత నానబెట్టకున్న బియ్యం, నీళ్లతో సహా వేసి గరిటెతో బాగా కలపి ఉడికించుకోవాలి.
- Step 7
ఒకవేళ కుక్కర్ ఉపయోగించినట్లయితే మూతపై బరువు పెట్టాల్సిన అవసరం లేదు.
- Step 8
అదే మందపాటి పాత్రను ఉపయోగించినట్లయితే దాని మూత ఉంచుకోవాలి.
- Step 9
అన్నం బాగా పొడిపొడిగా ఉడికించుకోవాలి. అన్నం ఉడికిందని నిర్ధారించుకున్న తర్వాత ముందుగా వేయించుకున్న జీడిపప్పు వేసి తిప్పి వేడి వేడిగా వడ్డించాలి.
- Step 10
అన్నం బాగా పొడిపొడిగా ఉడికించుకోవాలి. అన్నం ఉడికిందని నిర్ధారించుకున్న తర్వాత ముందుగా వేయించుకున్న జీడిపప్పు వేసి తిప్పి వేడి వేడిగా వడ్డించాలి.