- Step 1
చేప ముక్కలను శుభ్రంగా కడగాలి. ఒక గిన్నెలో చేప ముక్కలు, పెరుగు, నిమ్మరసం, పసుపు, కారం, గరం మసాలా వేసి అన్నిటినీ కలిపి పక్కన పెట్టుకోవాలి.
- Step 2
ఈలోగా బియ్యం కడిగి 30 నిమిషాలపాటు నాననివ్వాలి. బియ్యంలో తగినంత ఉప్పు వేసి పొడిపొడిగా ఉడికించి పక్కన పెట్టాలి.
- Step 3
ఇప్పుడు పాన్‌లో నూనె వేసి వేడెక్కాక అందులో ఏలకుల పొడి, లవంగాలు, దాల్చిన చెక్క, జాజికాయ పొడి, బిర్యాని ఆకులు, కరివేపాకు, పుదీనా, పచ్చిమిర్చి వేసి అన్నిటినీ దోరగా వేయించాలి.
- Step 4
అందులో కప్పు నీళ్లు పోసి నానబెట్టిన చేప ముక్కలు, కాస్త ఉప్పు వేసి తక్కువ సెగ మీద మూత పెట్టి ఉడికించాలి.
- Step 5
ఈ మిశ్రమం చిక్కబడ్డాక కుక్కర్‌లో ఉడికిన అన్నం కొంచం, చేప మిశ్రమం కొంచం, డాల్డా, నెయ్యి, కుంకుమపువ్వు, రోజ్ వాటర్, కెవ్రా వాటర్ కొంచెం కొంచెం చొప్పున అన్నిటినీ లేయర్స్‌గా వేసి మూతపెట్టి తిరిగి అయిదారు నిమిషాలు ఉడికించాలి.
- Step 6
తినబోయే ముందు సర్వింగ్ బౌల్‌లో బిర్యానీని తీసుకుని వేయించిన ఉల్లిపాయ తరుగు, కొత్తిమీర, నిమ్మచెక్కలతో గార్నిష్ చేయాలి. ఎంతో రుచికరమైన హైదరాబాది ఫిష్ బిర్యానీ రెడీ.